
కరీంనగర్: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా యంత్రాంగం ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఏర్పాటు చేసిన 3కె రన్ ను జిల్లా జడ్జి నాగమారుతి శర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ 3కె రన్ ఎస్.ఆర్.ఆర్.కాలేజి నుండి కోర్టు, ఆర్ అండ్ బి అతిధి గృహం, గీతా భవన్ చౌరస్తా, కలెక్టరేటు వరకు కొనసాగుతుంది. కలెక్టరేటులో గల గాంధీ విగ్రహనికి జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్, ఎస్పి, జెసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా జడ్జి ఓటర్లచే ‘‘భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్చాయుత నిశ్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలపెడుతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష, లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ’’చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా ఎస్పి, జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, అదనపు జెసి డా. నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, జిల్లా అధికారులు, ఆర్.డి.ఓ.చంద్రశేఖర్, డిఎస్పి, రామారావు, ఎన్.సి.సి. క్యాండెట్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.