ఓకే ఒక్క పరుగు.. భారత్ విజయానికి, బంగ్లా ఓటమికి..

కేవలం ఒకే ఒక్క పరుగు.. భారత క్రికెట్ జట్టు విజయానికి, బంగ్లా ఓటమికి మధ్య ఉన్న ఒక్క పరుగు ఉత్కంఠ రేపింది.. ప్రపంచకప్ టీట్వంటీ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో భారత్ ఓటమి అంచుల్లోంచి బయటపడి ఒక్క పరుగుతో విజయం సాధించింది. దాదాపు ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో ఆఖరి ఓవర్ హైలెట్ అని చెప్పాలి.

ఆఖరి ఓవర్లో బంగ్లా విజయానికి కావాల్సింది 11 పరుగులే.. ఆ చివరి ఓవర్ ను యంగ్ ఆల్ రౌండర్ పాండ్య వేశారు. మొదటి బంతి సింగిల్ వచ్చింది.. రెండు బంతుల్లో బంగ్లా బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీమ్ రెండు ఫోర్లు కొట్టడంతో మొత్తం 9 పరుగులు వచ్చాయి.. చివరి మూడు బంతుల్లో 2 పరుగులు చేస్తే బంగ్లా గెలిచినట్టే.. ఇక్కడ మాయ జరిగింది. హార్దిక్ పాండ్య చాకచక్యంగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీయడంతో బంగ్లా ఓడిపోయింది. భారత్ గెలిచింది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన తరుణంగా కెప్టెన్ ధోని పరుగులు రాని బంతికి పరుగెత్తుకొచ్చి వికెట్లను గిరాటేశాడు.. దీంతో ఔటైన బ్యాట్ మెన్ పరుగులు రాలేదు. ఇదే మ్యాచ్ లో కీలక మలుపు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *