ఒలంపిక్ రన్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల

కరీంనగర్: విద్యార్దులలో మానసిక ఉల్లాసం, శారీరక దారుడ్యం, సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం అంబేద్కర్ స్టేడియంలో ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలంపిక్ రన్ – 2016ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వము క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహిస్తుందని అన్నారు. గతంలో క్రీడలపై చిన్న చూపు ఉండేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్రీడలను గుర్తించి, క్రీడల నిర్వహణకు అధిక నిధులు కేటాయించి ప్రోత్సహిస్తుందని అన్నారు. విద్యార్ధులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని అన్నారు. విద్యార్ధులకు చదువు, మార్కులు ముఖ్యం కాదని, క్రీడల వద్ద శారీరక, మానసిక వికాసంతో పాటు చక్కటి క్రమ శిక్షణ సమానత్వం పెంపొందుతుందని అన్నారు. కార్పోరేట్ విద్యా సంస్ధల విద్యకే ప్రాధాన్యత ఇస్తాయని అన్నారు. విద్యార్ధులకు విద్యను ప్రభుత్వమే అందిస్తుందని, విద్య తో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు, శాసనసభ్యులు గంగుల కమలాకర్, జిల్లా టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, అర్జున అవార్డు గ్రహీత శ్రీనివాస రావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శివకుమార్, ఒలంపిక్ అసోసియేషన్ కన్వీనర్ విజయ భాస్కరరెడ్డి, చైర్మన్ తుమ్మల రమేశ్ రెడ్డి, వైస్ చైర్మన్ కరీం, కో-ఆర్డినేటర్లు మహేందర్ రావు, ఎ.రవి, పేటా అధ్యక్షుడు సారయ్య, ఎస్.డి.ఎఫ్. కార్యదర్శి పి. తిరుపతి, పేటా కార్యదర్శి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

EATELA RAJENDER     OLYMPIC DAY RUN 2016

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *