Breaking News

ఒబామా తాజ్ మహల్ టూర్ రద్దు

taj-mahal_oct28

ఢిల్లీ, ప్రతినిధి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రా పర్యటన రద్దయింది. జనవరి 26 సందర్భంగా భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొననున్న బరాక్ ఒబామా పర్యటనలో అగ్రాను పర్యటిస్తారని.. అక్కడ భద్రతా చర్యలను చేపట్టారు. కానీ అర్థాంతరంగా ఒబామా తాజ్ మహల్  పర్యటన రద్దు అయినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు తెలిపారు. దాంతో అగ్రా నుంచి అమెరికా భద్రతా బలగాలు వెనుదిరిగాయి.

భారత పర్యటన అనంతరం ఒబామా సరాసరి సౌది పర్యటనకు వెళ్లనున్నారు.  సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అబ్దుల్లా కుటుంబాన్ని పరామర్శించేందుకే ఒబామా తాజ్ మహల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *