
ఢిల్లీ, ప్రతినిధి : అగ్రరాజ్యం.. ప్రపంచంలోని ఏ దేశాన్ని అయినా గడగడలాడించే శక్తి అమెరికాది.. ప్రొటోకాల్ లు అంటూ ఏవీ లేకుండా తమ సైన్యంతో ఏ దేశంలోనైనా దాడికి దిగే దమ్ము ప్రపంచంలో అమెరికాకే ఉంది.. అలాంటి దేశానికి అధ్యక్షుడైన ఒబామా.. నరేంద్ర మోడీ గణతంత్ర దినోత్సవానికి రావాలని పిలవగానే రావడానికి ఒప్పుకోవడానికి గల కారణాలేంటి.? అంతటి అధ్యక్షుడు ఇండియాకు ఇంత సులభంగా రావడంలో కారణమేంటి.?
భారత్ .. ప్రపంచలంలోనే చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్.. ఇక్కడ అవకాశాలకు కొదవలేదు.. నరేంద్ర మోడీ ఎఫ్ డీ ఐ లకు ఆమోదం తెలపడంతో విదేశీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. చైనా స్వయం ఉత్పాదక దేశం.. ఆ దేశంతో వ్యాపారం కన్నా దిగుమతులే ఎక్కువగా చేసుకుంటుంది అమెరికా.. ఇక రెండో పెద్ద దేశమైన ఇండియాతో మైత్రి ఇప్పుడు అమెరికాకు చాలా అవసరం. ఇప్పటికే మోడీ చైనా, రష్యా, జపాన్ లతో వ్యాపారి మైత్రితో ఎవరూ ఇంత వరకు ఊహించని దౌత్య నీతితో భారత్ ను ప్రపంచ దేశాల్లో భిన్నంగా తీసుకెళ్తున్నారు. దీంతో తమ అవకాశాలు కోల్పోకుండా అమెరికా ముందు జాగ్రత్త పడింది. ఆ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక మాంద్యంతో కూనరిల్లుతున్న అమెరికా ఇండియా మార్కెట్ పై కన్నేసింది. ఆ నేపథ్యంలో మోడీ పిలవడమే ఆలస్యం.. ఒబమా ఇండియా పర్యటనకు ఒప్పుకొని గణతంత్ర దినోత్సవానికి హాజరుకానున్నారు.