ఒక విజిలేస్తే చాలు…

ఒక విజిలేస్తే చాలు…

మీరు రెస్టారెంట్ కి వెళ్ళినపుడు వాలెట్ పార్కింగ్ కోసం మీరు 10 నిమిషాలకంటే ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సి వస్తే మీరైతే ఎం చేస్తారు? విసుక్కుంటారు కదా ! కానీ ఇక్కడ ఒక 24 ఏళ్ళ అబ్బాయికి ఆప్ తయారు చెయ్యాలని అనిపించింది. అనిపించటమే తరువాయి వెంటనే ఆప్ రూపొందించి ఒక మంచి వ్యాపారంగా తీర్చి దిద్ది ఇప్పుడు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు . అనతి కాలం లోనే లక్ష డాలర్ల సంస్థ గా దాన్ని అభివృద్ధి చేశారు . ఏమిటా సంస్థ? ఎవరా అబ్బాయి? అనే పూర్తి వివరాలు….
************************

ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనన్ని మానవ వనరులు మన దేశంలో ఉన్నాయి. అదికూడా నైపుణ్యం కలిగిన యువత కలిగి ఉన్న దేశం మనది. సాధించాలన్న తపనతో ఉన్న యువకులకి కొదవ లేని సమాజం మనది. అటువంటి యువకుల ప్రతినిధి ఈ యువ కెరటం. ఆవేశం మాత్రమె కాదు, ఆలోచన కూడా పదునుగా ఉన్నవాడు. అందుకే విజయం అతన్ని వరించి వచ్చింది. తాను మొదలు పెట్టిన కంపెనీ అనతి కాలంలోనే విజయ శిఖరాల దిశగా దూసుకు పోతోంది. ఆ కంపెని పేరు విజిల్ డ్రైవ్. అది నడుపుతున్న యువకుడు రాకేశ్ మున్ననూరు. అతని విజయ ప్రస్థానం మీ కోసం ……..

***********************

నగరంలో మంచి డ్రైవర్ కావాలంటే చాల కష్టమైనా విషయం. తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చే డ్రైవర్లనే నమ్మగలం. ఎవరైనా తెలిసిన వాళ్ళనే డ్రైవర్లుగా పెట్టుకోవడానికి ఇష్ట పడతారు. తెలియని వారిని నమ్మడం కష్టం. అందువల్ల డ్రైవర్లు దొరకడం చాలా ఇబ్బంది. ఒక్కోసారి మన డ్రైవర్ అందుబాటులో లేకపోతే ఇక ఆ కష్టం చెప్పనలవి కానిది. తాత్కాలిక డ్రైవర్ దొరకడం గగనమే. ఒక వేళా ఎవరైనా దొరికినా సమయానికి వస్తాడన్న నమ్మకం ఉండదు.

వాలెట్ పార్కింగ్ సదుపాయం అందజేసే హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర కూడా డ్రైవర్ల కొరత వల్ల కస్టమర్లు వెహికల్ పార్క్ చేసేందుకు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది నిజానికి సహనానికి పరీక్ష. ఇలా డ్రైవర్ల కొరత వల్ల ఏర్పడుతున్న అసౌకర్యానికి చెక్ పెట్టేందుకు ఏర్పడిన సంస్థ విజిల్ డ్రైవ్. ఈ సంస్థ ఆప్ ద్వారా డ్రైవర్లను అందిస్తుంది. ఆప్ ద్వారా వీరి సేవలు వినియోగించుకోవచ్చు. ఆప్ ను రూపొందించి, దాన్ని సంస్థగా అభివృద్ధి చేసిన వ్యక్తి రాకేష్ మున్ననూరు.

ఇంజినీరింగ్ చదువుతున్న వారిలో చాలామంది క్యాంపస్ సెలెక్షన్స్ లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించటమే గొప్ప విజయంగా భావిస్తారు. ఎవరో వేసి పెట్టిన రోడ్ మీద సాఫీగా జీవితం సాగిపోతే చాలనుకుంటారు. కొద్దీ మంది మాత్రమే అందుకు భిన్నంగా కాస్త కష్టమైనా సరే తమకోసం ప్రత్యేకమైన బాట వేసుకోవాలని సంకల్పిస్తారు. అలాంటి అతి కొద్దిమంది యువకుల్లో ఒకరు రాకేష్. అందుకే ఆయన ఇంజనీరింగ్ లో చేరినప్పటి నుంచే అయన ఆలోచనలు అటువైపు సాగేవని అంటారు.

ముందు నుంచి అదే ఆలోచన

రాకేష్ ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే ఒక ఒక వెబ్సైటు డెవలప్ చేసి ఆఫ్ఫ్లియేటెడ్ కామర్స్ మార్కెటింగ్ విధానం లో ఆన్లైన్ షాపింగ్ పోర్టయిల్ ను కరీంనగర్ లో ప్రారంభించారు. దీని ద్వారా దుస్తులు, డియోడరెంట్లు స్థానికంగా సప్లయ్ చేసేవారు. నిజానికి అది చాలా విజయవంతంగా నడిచింది. ఇందుకు కొంత మంది మిత్రుల సహాయం తీసుకున్నాను. కానీ అప్పటికి ఇంకా చదువు పూర్తి కానందున దాన్ని కొనసాగించలేకపోయానని అన్నారు రాకేష్. ఇలా తనకు ముందు నుంచి కూడా సొంతంగా ఏదైనా చెయ్యాలనే ఉండేదని అంటారు ఆయన.

నెక్స్ట్ ఏంటి?

ఇంజినీరింగ్ తర్వాత రాకేష్ ఉద్యోగం చెయ్యటానికి ఆసక్తి కనబరచలేదు. ఏదైనా భిన్నంగా చెయ్యాలన్న తపన ఉంది కానీ ఎం చెయ్యాలో అప్పటికి ఇంకా నిర్ణయించుకోనందున విదేశాల్లో చదువుకోవాలనే నేపాన్ని తనను ప్రశ్నించే వారికి సమాధానంగా చెబుతుండేవారు. అందుకోసం జి ఆర్ ఈ కూడా రాశారు. అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచారు. మొత్తం 120 పాయింట్లకు గాను ఆయన 112 వరకు సాధించారు. తలచుకుంటే మంచి స్కాలర్షిప్ తో విదేశాల్లో చదువుకోవచ్చు. కానీ తన ఉద్దేశ్యం విదేశాల్లో చదువు కాదనేది ఆయన మనసులో మాట. 6 నెలల పాటు ఎం చేస్తే బావుంటుందని అన్వేషణ సాగించాను అని చెప్పుకొచ్చారు రాకేష్. ఇలాంటి ఆలోచనల్లో ఉండగానే మిత్రులతో కలిసి ఆయన ఒక సారి ఒక ప్రముఖ రెస్టారెంట్ లో భోంచెయ్యడానికి వెళ్ళినపుడు అక్కడ కార్ వాలెట్ పార్కింగ్ కి ఇవ్వటం కోసం 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చిందట. అందుకు కారణం అక్కడ వాలెట్ పార్కింగ్లో డ్రైవర్లు సరిపడినంతగా లేరు. భోజనం తర్వాత కూడా తిరిగి కార్ తీసుకోవడానికి ఇలాగే వేచి ఉండాల్సి వచ్చింది . ఆ విసుగులో దీనికి కూడా ఒక ఆప్ ఉండి … గెట్ మై కార్ అని టైపు చెయ్యగానే కార్ వచ్చేసే సదుపాయం ఉంటె బావుంటుందనే ఆలోచన వచ్చిందని చెప్పారు అయన.

ఇక వెంటనే నగరంలో డ్రైవర్ల పరిస్థితి గురించి అధ్యయనం చెయ్యటం మొదలు పెట్టారు. ఆయన అధ్యయనం లో డ్రైవర్ల ఆవశ్యకత తీవ్రంగా ఉందన్న సంగతి అర్థమైంది. ‘డ్రైవర్ అవసరమున్న వారికి డ్రైవర్లను అందించే సరైన సంస్థ ఏదీ అందుబాటులో లేదని అర్ధమైంది. ఓలా, ఉబెర్ వంటివి టాక్సీ సర్వీస్ అందించినట్టుగా ఆప్ ద్వారా డ్రైవర్లని అందించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే విజిల్ డ్రైవ్ కి మూలం ‘ అని తన సంస్థ రూపొందిన విధానాన్నీ వివరించారు.

చాలా సౌకర్యవంతం

కార్ ఓనర్స్ కి డ్రైవర్లను అందించటం కోసం మొదట ఈ ఆప్ ను రూపొందించారు. ఈ ఆప్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్ ఓల, ఉబెర్ ల మాదిరిగానే పని చేస్తుంది. డ్రైవర్ కావాలని రిక్వెస్ట్ పెట్టగానే ఎంత సమయంలో డ్రైవర్ అందుబాటులోకి వచ్చేది. ఎన్ని నిమిషాల్లో కస్టమర్ ని చేరుకునేది ఆప్ ద్వారా తెలుసుకోవచ్చు. అతడు వస్తున్నా దారిని కూడా ట్రాక్ చెయ్యవచ్చు. నిజానికి డ్రైవర్ దొరికినా, అనుకున్న సమయానికి చేరుతాడో లేదో అనే టెన్షన్ ఉండనే ఉంటుంది. విజిల్ డ్రైవ్ తో ఆ బాధ ఉండదు. అంతే కాదు డ్రైవర్ ను ఇచ్చి పిల్లలను బయటికి పంపించినప్పటికీ వెహికిల్ ను కూడా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. 2017లో ప్రారంభించినప్పుడు కేవలం డ్రైవర్లను అందించేవారు. తర్వాత కాలంలో కేవలం కస్టమర్లకు డ్రైవర్లను అందిచడం మాత్రమే కాదు రెస్టారెంట్లు, హోటళ్లకు కూడా డ్రైవర్లను అందించడం మొదలు పెట్టారు. కేవలం సంవత్సరం తిరిగే సరికి సంస్థను చాలా విస్తరించగలిగారు. కేవలం కస్టమర్లకు మాత్రమే కాదు, ఫంక్షన్లు, శిల్పారామం, హెచ్ ఐ సి సి వంటి ప్రదేశాల్లో జరిగే పెద్దపెద్ద ఈవెంట్స్ కి కూడా తమ సేవలను అందించా గలుగుతున్నారు. కార్పొరేట్ సంస్థలకు కేవలం డ్రైవర్లను మాత్రమే కాదు ఉద్యోగుల రవాణా సావుకార్యాలను కూడా అందిస్తున్నారు.

అనతి కాలం లోనే …

కేవలం సంవత్సర కాలం లో ఒక స్టార్ట్ అప్ కంపెనీని ప్రారంభించి దాన్ని విజయాల బాట పట్టించటమంటే ఈ పోటీ ప్రపంచంలో అంత సుల్లభం కాదు. దీని వెనుక పట్టుదలతో పాటు అకుంఠిత దీక్ష, సరైన ప్రణాళిక అవసరమౌతుందని రాకేష్ అంటారు. అమెరికాకు చెందిన సీడ్ ఫండింగ్ అనే సంస్థ లాభాల్లో ఉన్న స్టార్ట్ అప్ కంపెనీలకు ఫండింగ్ చేస్తుంది. ప్రస్తుతం అక్కడి నుండి విసిల్ డ్రైవ్ సంస్థలో లక్ష డాలర్ల పెట్టుబడి అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మొదలైన విజిల్ డ్రైవ్ కంపెనీ ప్రస్తుతం వివిధ కార్పొరేట్ కంపెనీలకు చెందిన దాదాపు 3000 మంది ఉద్యోగులకు రవాణా సౌకర్యం అందిస్తోంది. “అయితే ఇలాంటి సౌకర్యం అందించే వారు మరికొంత మంది ఉండొచ్చు, కానీ మేము అందరికీ భిన్నంగా మా ఆప్ తయారు చేసాము. మా సాఫ్ట్వేర్ లో డేటా అంత ఫీడ్ చేస్తాం, అందువల్ల అల్గారిథం రన్ చేసే షెడ్యూల్ చెయ్యడం చాలా సులభం. చిన్న చిన్న మార్పులు ఇప్పటికప్పుడు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల టైం చాలా సేవ్ అవుతుంది.” అని తాము మిగతా వారికి ఎలా భిన్నంగా ఉన్నది వివరించారు రాకేష్. త్వరలోనే తమ సేవలను బెంగుళూరు, చెన్నై, పూణే పట్టణాలకు విస్తరించబోతున్నామని కూడా ఆయన వెల్లడించారు. ఇప్పుడు 3 కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న తాము త్వరలోనే 5 కోట్లకు చేరుకోగలమన్న విశ్వాసం అయన మాటల్లో కనిపించింది.

ఎవరైనా చెయ్యొచ్చు

ఈ రోజుల్లో యువతకు మీరు ఐకాన్గా నిలుస్తున్నారు ఈ విజయంతో రాబోయే రోజుల్లో సొంతంగా ఎదగాలనుకునే వారికి ఏదైనా సూచన చెయ్యగలరా అని అడిగినపుడు “స్టార్ట్ అప్ ఎవరైనా మొదలు పెట్టొచ్చు. కాకపోతే ముందుగా మనం ఎలాంటి సేవలు అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం, ఆ సేవల అవసరం సమాజానికి ఎంత అవసరముంది, వంటి విషయాలన్నింటిని కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ముందుగా ఒక చిన్న వాట్సాఅప్ నెంబర్ తో ప్రారంభించి స్పందన బావుంటే అప్పుడు ఆప్ తయారు చేసుకోవడం మంచిది. ఏదైనా సరే మినిమం వాయబుల్ ప్రోడక్ట్ అయితే చాలు. పెట్టుబడి మీద రిటర్న్స్ తీసుకునే మార్గాలు మాత్రమే మొదట్లో ఆలోచించాలి. ఒక సారి మనం చేస్తున్న పనిలో లాభం ఉందని చిన్న స్థాయిలో నిరూపించగలిగినా చాలు పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారు. ఊరికే ఐడియా ఉంది అంటే ఎవరూ పెద్దగా ప్రోత్సాహం అందించరు.” అని విజయం సాధించేందుకు మార్గాన్ని కూడా రాకేష్ వివరించారు.

 

స్మాల్ టౌన్ గయ్

రాకేష్ కుటుంబం వ్యాపార కుటుంబమేమీ కాదు. అయన పుట్టి పెరిగింది తెలంగాణ లోని చిన్న పట్టణం కరీంనగర్ లోనే. అయన తండ్రి రమేష్ రావు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గ పనిచేస్తున్నారు. తల్లి అనిత గృహిణిగా ఉన్నారు. ఒక తమ్ముడు ఉన్నాడు. అతడు ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు. ఇలా అతిసాధారణ చిన్న కుటుంబం వారిది. స్కూల్ విద్య మొత్తం అక్కడే. ఇంటర్మీడియేట్ కి హైదరాబాద్ లో చదువుకున్నారు. ఆ తర్వాత బీటెక్ చదివేందుకు నోయిడాలోని శివనాథర్ యూనివర్సిటీని ఎంచుకున్నారు. 2015 లో అయన బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ చదివే రోజుల్లోనే చిన్న వ్యాపారం ప్రారంభించి అది కూడా విజయవంతంగా నడుస్తున్న రోజుల్లోనే చదువు పూర్తి చెయ్యాల్సి ఉన్నందున దాన్ని పక్కన పెట్టారు.

భవాని

IMG-20180811-WA0259IMG-20180810-WA0492IMG-20180810-WA0389IMG-20180810-WA0490IMG-20180810-WA0388IMG-20180810-WA0387IMG-20180811-WA0260

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.