
సినిమా పరిశ్రమలో నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా గొప్ప స్ధానంలో నిలిచిన వ్యక్తి వీబీ రాజేంద్రప్రసాద్ గారు. చాలా సౌమ్యుడు. అనేక గొప్ప చిత్రాలను నిర్మించడమే కాకుండా, దర్శకుడిగా కూడా గొప్ప సినిమాలను తెరకెక్కించారు. సినిమా పరిశ్రమకి చెందిన వ్యక్తులంటే ఆయన ఎనలేని గౌరవం. ప్రతి ఒక్కరితో చక్కగా మాట్లడేవారు. నిర్మాతగా మంచి విలువలను పాటించినవారు. ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించారు. అటువంటి ఆయన మనకు దూరమవడం చాలా బాధాకరం. ఆయన మరణం తీరని లోటు. ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను