
-ఉద్యోగులను ప్రశ్నించిన కరీంనగర్ నూతన జేసి పౌసుమి బసు
– తొలిరోజే కలెక్టరేట్ లో హల్ చల్..
కరీంనగర్ , ప్రతినిధి : పౌసుమి బసు.. ఐఏఎస్ అధికారి.. కరీంనగర్ జాయింట్ కలెక్టర్ గా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె వస్తున్నట్టు.. బాధ్యతలు చేపడుతున్నట్టు ఎవరికి తెలీదు. మంగళవారం 4 గంటలకు బాద్యతలు చేపడతానని అరగంటముందే ఆమె జిల్లా అధికారులకు చెప్పారట.. దీంతో హైరానపడిన అధికారులు యుద్ధ ప్రాతిపదిక ఏర్పట్లు చేసి ఏదోలా ఆమెకు స్వాగతం పలికారు. కానీ బోకేలు వరుసగా ఇవ్వడం చూసి అందరూ ఒకే డిపార్ట్ మెంట్ ఇన్ని బొకేలు అవసరమా అని అధికారులను నిలదీశారట.. తొలిరోజే ఆమె ప్రశ్నలు కురిపించడంతో అక్కడున్న అధికారులు అవక్కాయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె రెవన్యూ, పౌరసరఫరాలకు సంబంధించిన జిల్లా నివేదికలన్నీ కావాలని కోరారట.. పండుగు తర్వాత పాలన పరుగులు పెట్టాలని ఈ రెండు రోజుల్లోగా తనకు నివేదికలు ఇవ్వాలని అధికారులకు హుకూం జారీ చేశారట.. సో జేసీ స్పీడ్ చూసి అధికారులు బేజారెత్తారు..
మొత్తానికి ఈసారి కరీంనగర్ పాలన పగ్గాలు ఇద్దరు మంచి పడతుల చేతిలో పడడంతో జనాలు సంతోషపడుతున్నారు.. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశలు నెరవేరుతాయో లేదో మున్ముందు తేలనుంచి