‘ఒక్క అమ్మాయి తప్ప’ ఆడియో విడుదల 

‘ప్ర‌స్థానం’ వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరో గా నటించిన  చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. మంచి కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఆడియో ను మే 8 న శిల్ప కళా వేదిక లో చాలా గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది.  మిక్కి జె.మేయర్‌ సంగీతాన్ని అందించగా, చిత్రం లో ని పాటలను శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ రచించారు. మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. అయన గతం లో  ‘సినిమా చూపిస్త‌మావ’ చిత్రానికి నిర్మాత గా ఉన్నారు. ” ఈ చిత్రం ఆడియో ను మే 8న విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మే నెలలో నే మా ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం “, అని అయన అన్నారు . రాజ‌సింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయన గతం లో ఎన్నో చిత్రాలకు రచయిత గా పని చేసారు. “ఇది ఒక డిఫ‌రెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. సందీప్‌ కిష‌న్‌ చాలా కొత్త గా , స్టైలిష్ గా కనిపిస్తారు ” అని ఆయన అన్నారు. నటీ నటులు – సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి,రేవతి తదితరులు. సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాత : మాధవి వాసిపల్లి,  నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ

sandeep.,

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *