
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర్రంలో ఒక విద్యా సంవత్సరంలో 250 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర్ర ఆర్ధిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కరీంనగర్ లో మంత్రి మైనారిటి రెసిడెన్సియల్ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం మైనారిటీల కొరకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేయలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 71 పాఠశాలలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు మానవ విలువలు నేర్పుతారని అన్నారు. పేద ప్రజలకు మెరుగైన విద్య, వైద్యాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆగష్టు కల్ల అన్ని ప్రభుత్వ పాఠశాలలలో 15 కోట్ల రూపాయలతో ఫర్నిచర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం 130 కోట్ల రూపాయలతో మౌళిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్ధులు ప్రజలకు మెరుగైన సేవలను అందించగలరని అన్నారు. మైనారిటీల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభుత్వాలకు సంక్షేమ కార్యక్రమాల పట్ల చిన్నచూపు ఉండేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిందని అన్నారు. విద్యతోనే రాష్ట్ర్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన ప్రభుత్వం విద్యకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తుందని అన్నారు. ప్రాచీన భారతదేశంలో గురుకులాల ద్వారానే విద్యను బోధించేవారని అన్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలో చదివిన తాను ఈనాడు ఈ స్ధాయికి ఎదిగానని అన్నారు. కరీంనగర్ ఎం.పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా మైనారిటీలకు గురుకుల పాఠశాల ద్వారా విద్యను అందించడం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలు విద్యారంగాలలో ముందుకు సాగాలనే లక్ష్యంతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. తమ సమస్యలను జిల్లా కలెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ కు తెలపాలని అన్నారు. విద్యార్ధులకు ఉచిత భోజన వసతిలో పాటు ఉచితంగా డ్రస్సులను కూడా ఇస్తుందని అన్నారు. మూనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సోసైటీ ఉపాధ్యక్షులు, డి.జి.పి. ఎ.కె.ఖాన్ మాట్లాడుతూ, మైనారిటి రెసిడెన్సియల్ పాఠశాలలలో చదివే ప్రతి విద్యార్ధి పైన 80 వేల రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వము ఇంత పెద్ద స్ధాయిలో మైనారిటీల కొరకు పాఠశాలలను స్ధాపించలేదని అన్నారు. అన్ని పాఠశాలలు ప్రారంభమైతే 17 వేల మంది విద్యార్ధులు ప్రతి సంవత్సరం బయటకు వస్తారని అన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ మాట్లాడుతూ, పేద మైనారిటీ విద్యార్ధులకు నాణ్యమైన విద్యను ఈ పాఠశాలలు అందిస్తాయని అన్నారు. అందరు ఉపయోగించుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల పైన నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని అన్నారు. అన్ని వసతులను కల్పిస్తామని అన్నారు. సమస్యలేమైన ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎం.ఎల్.సి. నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఈ పాఠశాలలను స్ధాపించడం శుభదినం అని అన్నారు. ప్రభుత్వం మతాలకు అతీతంగా అందరు ఒక్కరనే పరిపాలన సాగిస్తుందని అన్నారు. ఎం.ఎల్.ఎ. గంగుల కమలాకర్ మాట్లాడుతూ, మైనార్టి రెసిడెన్సియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులు భారతదేశం గర్వించే విధంగా ఎదగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉర్ధు అకాడమి డైరెక్టర్ ఎస్.ఎ. సుకూర్, జిల్లా మైనార్టి అధికారి, ఇడి మైనార్టి తదితరులు పాల్గొన్నారు.