
భారత్ విదేశాల్లో విజయబావుటా ఎగురవేసింది.. ఒకరోజు క్రికెట్, టెన్నిస్ లలో విజయదుంధుబి మోగించింది. ఆదీ ఆస్ట్రేలియాలో సాధించడం విశేషం.. క్రికెట్ లో భారత పురుషుల, మహిళల జట్లు ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించాయి..
ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ లో వేదికగా జరిగిన టీట్వంటీలో పురుషుల జట్టు వరుసగా రెండో టీట్వంటీలో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.. 2-0తో క్రికెట్ లో ఆస్ట్రేలియాపై ఇండియా ఘనవిజయం సాధించి సిరీస్ సాధించింది.. ఇక మహిళల జట్టు సైతం వరుసగా ఆస్ట్రేలియా మహిళల జట్టుపై విజయం సాధించింది.. ఇక సానియా మీర్జా-మార్టినా హింగిస్ నేతృత్వంలోని డబుల్స్ టీం మహిళల టెన్నిస్ లో విజయం సాధించింది. మొత్తానికి ఒకే రోజు టీమిండియా మూడు విజయాలతో చరిత్ర తిరగరాసింది..