Breaking News

ఒకరికి ఒకరు తోడుంటే..

twins day

-నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం
కడుపులో ఒకేసారి రూపుదిద్దుకుంటారు.. అచ్చం ఒకేలాగా ఉంటారు.. వారే కవలలు. ఇద్దరినీ చూస్తే ఎవరు ఎవరో గుర్తుపట్టడం కష్టం.. ఒక పోలిక కలిగిన వ్యక్తులను చూసీ ఆశ్చర్యపోతుంటాం… అరె వీరిద్దరు సేమ్ టూ సేమ్ ఉన్నారే.. కవల పిల్లలు కనిపించిన చోట ఇలాంటి మాటలు మామూలే.. పుట్టిన బిడ్డను చూసీ తండ్రిలా ఉన్నారనో.. తల్లిలా ఉన్నారనో పోలికలు చూసి ముచ్చటపడతాం.. ప్రపంచంలో ఏడుగురు మనలాంటి రూపు రేఖలున్నవారు ఉన్నారని చర్చించుకుంటాం. ఏది ఏమైనా కవలలు పుట్టడం ఓ అద్భుతం.. విచిత్రం.. ఇలా కవలలుగా పుట్టడం అదృష్టమంటున్నారు కొందరు. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా కవలలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వారికి శుభాకాంక్షలు చెబుతాం..

అసలు ఈ పండుగ ఇలా వచ్చిందంటే..
కవలలు గురించి చెప్పే శాస్త్రాన్ని జమటాలజీ అంటారు. మోజెస్, ఆరన్ కార్స్ అనే కవల సోదరులు పోలండ్ దేశంలో నివాసముండే వారు. 1819లో వీరుంటున్న ఊరికి కొత్తగా ట్విన్స్ బర్డ్ అని పేరు పెట్టారు. ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతోంది. వారిద్దరు సోదరులు ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతూ ఒకే రోజున మరణించారు. ఆ ఊరి ప్రజలు ఈ కవల సోదరులపై ఉన్న విశేష అభిమానంతో 1976 ఫిబ్రవరి 22 తేదీన మొదటిసారి కవలల దినోత్సవం జరుపుకున్నారు. పోలెండ్ దేశంలో ఇదీ ప్రతీ ఏడాది జరుపుకుంటున్నారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ట్విన్స్ డే నిర్వహిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో దాదపు 125 మిలియన్ మంది కవలలు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *