ఒకడే ఒక్కడు మొనగాడు..

-తెలంగాణను గెలిచిన పనివాడు.. -టీఆర్ఎస్ ప్లీనరీ స్పెషల్ స్టోరీ
2001లో ఆయన టీఆర్ఎస్ ను ప్రారంభించినప్పుడు ఎవరు లేరు.. ప్రత్యేక తెలంగాణ అంటే అందరూ నవ్వారు.. ఒక్కడై నిలిచాడు.. ఒంటరిగా బరిలో దిగాడు.. పదులు, వందలయ్యారు.. వందలు వేలు లక్షలు, కోట్ల మంది ఆశ తెలంగాణగా మారేందుకు ఆ ఒక్కడు వేసిన అడుగే నేటికి స్పూర్తి అయ్యింది. తెలంగాణను సాధించిపెట్టింది.

2001లో ప్రారంభమైన కేసీఆర్, టీఆర్ఎస్ ప్రస్థానం రాష్ట్రాన్ని సాధించేవరకు సాగింది.ఆంధ్రా వారి కుట్రలు, మీడియా అవమానాలు, వైఎస్ కుట్రలు, కిరణాలు కుతంత్రాలు, రోశయ్య ఎకసెక్కాలు, చంద్రబాబు సవతి చూపులు ఇలా అవమానాలెన్ని ఎదురైనా మొక్కవోని దీక్షతో సాగిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం స్వరాష్ట్ర కళ సాకారంతో పరిసమప్తమైంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి టీఆర్ఎస్ ప్లీనరీకి అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. టీఆర్ఎస్ ఆవిర్భావించిన ఏప్రిల్ 27ను పురస్కరించుకొని హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఈనెల 24నుంచి ప్రారంభమవుతోంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థాయి నుంచి హాజరవుతున్నారు. అధికారంలో ఉండగా టీఆర్ఎస్ పార్టీ ఇలా ప్లీనరీ చేసుకోవడం ఇదేతొలిసారి. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో హైదరాబాద్ వెలిగిపోతోంది.ప్లీనరీ వేదికపై కేసీఆర్, మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు.. సీనియర్ టీఆర్ఎస్ నేతలు దాదాపు 42 మంది ఆసీనులవుతారు. ప్లీనరీ ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతుండడంతో భోజన , మంచినీరు, చల్ల, వైద్యశిబిరం ఇలా అన్ని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ దండు.. రేపటినుంచి జరిగే ఈ ప్లీనరీ కోసం అందరూ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *