
బీహార్ ఎన్నికలు తారాస్థాయికి చేరిన వేళ నితీష్ కుమార్-లలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. నితీష్ జేడీయూ పార్టీ ఎమ్మెల్యే టికెట్ పొందిన ఓ ఎమ్మెల్యే బీహార్ లో క్లబ్ డ్యాన్స్ లో చిందులు వేయడం ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది.. అతనో ఎమ్మెల్యే అభ్యర్తి అని మరిచిపోయి పిచ్చిపిచ్చిగా డ్యాన్స్ చేశారు. ఇదంతా వీడియో తీసిన మీడియా అతడి బండారాన్ని బయటపెట్టింది. దీంతో పాపం ఎమ్మెల్యే పరిస్థితి చూసి నితీశ్ కుమార్ తల పట్టుకున్నాడట..