ఐ-ఫోన్ 6ను దాటేసిన శ్యాంసంగ్ గెలాక్సీ

హైదరాబాద్, ప్రతినిధి : ఇవాళ కొన్న కొత్త స్మార్ట్ ఫోనే ఓ వారం రోజులకి బోర్ కొట్టేసే స్థాయికి నేడు మొబైల్ మార్కెట్ చేరుకుంది. అందులో యాపిల్ ఐఫోన్లు, శ్యాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లో బాగా పోటీపడుతున్నాయి. దీంతో అమెరికాలో ఈ రెండు బ్రాండ్లని వినియోగిస్తున్న వారి నుంచి తాజాగా ఓ సంస్థ అభిప్రాయసేకరణ జరిపింది. ఈ సర్వేలో ఐఫోన్ 6 కన్నా శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 ఫోన్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ సర్వేలో గెలాక్సీ ఎస్ 5 యాక్టివ్‌కి 79 పాయింట్లు రాగా, గెలాక్సీ ఎస్ 5 స్పోర్ట్ 78 పాయింట్లు సొంతం చేసుకుంది. LG G3 కూడా గెలాక్సీ స్పోర్ట్‌తో సమానంగా పోటీపడి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇదిలావుంటే స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఎంతో క్రేజ్ వున్న ఐఫోన్ 6 మాత్రం 77 మార్కులే పొంది ఆ రెండింటి తర్వాతి స్థానంలో నిలవడం స్మార్ట్ ఫోన్ యూజర్స్‌ని ఆశ్చర్యానికి గురిచేసింది. HTC one (M8), శ్యాంసంగ్ గెలాక్సీ నోట్ 4, శ్యాంసంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ మొబైల్స్ 75 మార్కులు పొందాయి. ఐఫోన్ 6 ప్లస్ 73 మార్కులే సొంతం చేసుకుంది. వాడుకలో వున్న సౌకర్యం, లేటెస్ట్ ఫీచర్స్, కాస్ట్, బ్యాటరీ లైఫ్, బ్యాటరీ స్టాండర్ట్ టైమ్, యూజర్ శాటిస్‌ఫాక్షన్ లాంటి కొన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే జరిపినట్లు సంస్థ తెలిపింది. వచ్చే ఫిబ్రవరిలో ఈ స్టడీ వివరాల్ని ప్రచురించేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ అధ్యయనం ఫలితాలు చూసినవాళ్లంతా ఐ ఫోన్ 6 కంటే శ్యాంసంగ్ గెలాక్సీయే బెటరా అనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.