ఐ జె యు బాస్ మళ్ళీ మన సారే!

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక!
-సెక్రటరీ జనరల్ గా బల్విందర్ జమ్మూ ….
-12 రాష్ట్రాల నుంచి వారిపేర్లతో నామినేషన్లు
-నామినేషన్ల చివరిరోజు ఒక్క సెట్ నామినేషన్లు రావడంతో వారి ఎన్నిక -ఏకగ్రీవం అయినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి ఎం ఏ మాజీద్
-జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కృషి చేస్తామని వెల్లడి
-తమపై నమ్మకంతో భాద్యతలు ఉంచిన వివిధ రాష్ట్రాల జర్నలిస్ట్ నాయకులకు కృతజ్నతలు

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ , ప్రజాపక్షం ఎడిటర్ , ఐజేయూ అధ్యక్షులుగా వ్యహరిస్తున్న కె .శ్రీనివాస్ రెడ్డి , తిరిగి ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు . ఆయన గత 50 సంవత్సరాలుగా జర్నలిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు . వివిధ హోదాల్లో ఆయన జర్నలిస్టులు పక్షాన నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రెస్ ఎకాడమి చైర్మెన్ గా వ్యవహరించిన ఘనత కూడా ఆయనికి దక్కింది . జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో ఆయనకు అత్యంత ప్రతిభాశాలిగా పేరుంది. నిర్మాణంలోనూ , నాయకులను తయారు చేయడంలోనూ ఆయన అనుసరిస్తున్న పద్ధతులు మరొకరు వేలెత్తి చూపలేనివిగా ఉంటాయి. అనేక క్లిష్ట సమస్యలను సైతం ఇట్టే పరిష్కరించగల దిట్ట . తెలుగు రాష్ట్ర జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో ఆయన మకుటంలేని మహారాజు … రాష్ట్రానికి సీఎం ఎవరైనా శ్రీనివాస్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకున్నారంటే ఆశ్చర్యం లేదు .శ్రీనివాస్ రెడ్డి గతంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ గా సుదీర్ఘకాలం పనిచేశారు . 12 రాష్ట్రాల నుంచి ఐజేయూ అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ గా బల్విందర్ జమ్మూ పేర్లతో నామినేషన్లు దాఖలు కావడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం ఏ మాజీద్ ప్రకటించారు. వారి ఎన్నిక పట్ల తెలంగాణ , అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నేతలు అంబటి ఆంజనేయులు , వై నరేందర్ రెడ్డి , నగునూరి శేఖర్ , విరహత్ అలీ , సుబ్బారావు , చందు జనార్దన్ , ఆలపాటి సురేష్ , డి సోమసుందర్ , దాసరి కృష్ణారెడ్డి , కె సత్యనారాయణ , తాడూరు కరుణాకర్, కె రామ్ నారాయణ, దొంతు రమేశ్, అయిలు రమేశ్, గాడిపల్లి మధు, ఏ. రాజేష్, శంకర్ గౌడ్,గడ్డం రాజిరెడ్డి, వల్లాల వెంకట రమణ, రామచంద్రం, దుర్గా ప్రసాద్, గాండ్ల శ్రీనివాస్, ఎలగందుల రవి, అంగిరేకుల సాయిలు, వనపర్తి మధు, పేపర్ సీనన్న, మహిపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, యూసుఫ్ బాబు, హరి, రంగా చారి, కోటి రెడ్డి తదితరులు హర్షం ప్రకటించారు .

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.