Breaking News

ఐ… అద్భుతాలు నై…

I movie

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మన ముందుకు తెచ్చిన ఐ సినిమా అంత ఎక్సయిటింగ్ గా లేదనే టాక్ వచ్చేసింది. సాంకేతికంగా అద్భుతాలు చేయడమే కాదు, కథా కథనం విషయంలోనూ కొత్తదనంతో కట్టి పడేసే శంకర్ ఐ విషయంలో మాత్రం తన ట్రాక్ రికార్డును కాపాడుకోలేక పోయారు.

పైగా ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాలను టచ్ చేసే శంకర్, ఐ లో కేవలం విక్రం మేకప్ మీదే ఫోకస్ చేసి కథను నిర్లక్ష్యం చేశాడనే టాక్ వచ్చింది.  ఫారిన బ్యూటీ అమి జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వైవిధ్య భరితమైనవి పెద్దగా ఏమీ లేవు. హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం, భయానకమైన వైరస్ సోకే ఇంజెక్షన్ ను విక్రం కు ఎక్కించడం, ఆ తర్వాత అతడు ప్రతీకారం తీర్చుకోవడం ఇందులో మెయిన్ పాయింట్స్. టేకింగ్ కోసం శంకర్ పడ్డ కష్టం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. కానీ అంతగా పసలేని కథే దీనికి మైనస్ పాయింట్. విక్రం నటన సూపర్.

సినిమా అంటే కేవలం విక్రం మాత్రం కాదు. హీరోయిన్ ను అందంగా చూపించడం ఒక్కటే కాదు. అసలు, ఉత్కంఠ భరితమైన కథ ఉంటే గ్లామరస్ హీరోయిన్ లేకపోయినా జనం చూస్తారు. ఏరియాల వారీగా భారీ రేట్లకు అమ్ముడు పోయిన ఈ సినిమా, బయ్యర్లను గట్టెక్కిస్తుందో నట్టేట ముంచుతుందో అనే టాక్ మొదలైంది. ఎలాగైనా పెట్టిన డబ్బులు వస్తే చాలని బయ్యర్లు కోరుకుంటున్నారు. శంకర్ శ్రమ, విక్రం నటన కోసం సినిమా చూసే వారి సంఖ్య పెరిగితే, వసూళ్ల విషయంలో ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశమైతే ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *