ఐర్లాండ్ పై భారత్ ఘనవిజయం

shikar

-సెంచరీ కొట్టిన శిఖర్ ధావన్
అక్లాండ్ : ప్రపంచకప్ లో మంగళవారం జరిగిన ఐర్లాండ్ , భారత్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 49 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ పోర్టర్ ఫీల్డ్ 67, నీల్ ఓ బ్రెయిన్ 75,స్టిర్లింగ్ 42 పరుగులతో రాణించారు. మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి ఐర్లాండ్ తక్కువ పరుగులు చేయడంలో విజయం సాధించారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఓపెనర్లు శిఖర్, రోహిత్ మంచి ప్రారంభాలిచ్చారు. శిఖర్ ధావన్ సెంచరీ(100) చేశారు. రోహిత్ 64, కోహ్లీ 44, రహానే 33 పరుగులు చేశారు. దీంతో ఇండియా విజయబావుటా ఎగురవేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *