
ప్రపంచకప్ క్రికెట్ లో మరో సంచలనం నమోదు కాలేదు.. గ్రూప్ బి నాకౌట్ బెర్త్ కోసం జరిగిన క్రికెట్ ఫైట్ లో ఐర్లాండ్ ఓడిపోయి ఇంటికి పోయింది. గ్రూప్ బిలో ఇప్పటికే అగ్రస్థానంతో భారత్, రెండోస్థానంతో దక్షిణాఫ్రికా క్వార్టర్స్ చేరిన సంగతి తెలిసిందే.. ఇక మరో రెండు స్థానాల కోసం పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ లు పోటీపడ్డాయి. కానీ ఇందులో ఎలాంటి సంచలనం నమోదు కాలేదు.
వెస్టిండీస్ , యూఏఈ పోరులో వెస్టిండీస్ విజయంతో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్ లో ఐర్లాండ్ పై భారీ విజయం సాధించిన పాకిస్తాన్ టీం డైరెక్ట్ గా క్వార్టర్స్ కు దూసుకెల్లింది.
మొదట యూఏఈ, వెస్టిండీస్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం విండీస్ 4 వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ 30 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది.
మరో మ్యాచ్లో ఐర్లాండ్, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఐర్లాండ్ క్వార్టర్స్ చేరేది. కానీ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50ఓవర్లలో 237 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 241/3 విజయం సాధించింది.
ఉత్కంఠ రేపిన గ్రూప్ బి క్వార్టర్స్ పోరు ఐర్లాండ్ ఓటమితో పరిసమప్తమై విండీస్, పాక్ లకు లైన్ క్లియర్ అయ్యింది.