ఐపీఎల్ 2015 విజేత ముంబై ఇండియన్స్

-ఫైనల్లో చైన్నై చిత్తు చిత్తు..

కోల్ కతా : వరుసగా ఐదారు ఓటములతో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై ఐపీఎల్ టైటిల్ విజేత గా నిలుస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఆ తర్వాత బాగా పుంజుకొని టైటిల్ గెలిచి అందరి మనసులు గెలుచుకుంది.  ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం ముంబై ఇండియన్స్ , చైన్నై సూపర్ కింగ్స్ పై గెలిచి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. లీగ్ 2015 విజేతగా నిలిచింది.

ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై సిమన్స్ 68, రోహిత్ శర్మ 50 పరుగులతో చెలరేగడంతో 5 వికెట్లకు 202 భారీ స్కోరు చేసింది.

అనంతరం బ్యాటింగ్ చేసిన చైన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది. డ్వేన్ స్మిత్ 57 పరుగులతో ఒంటరి పోరాటం చేశారు.

baji

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *