ఐపీఎల్ లో అద్భుత క్యాచ్

ఐపీఎల్ లో అద్భుతం చోటుచేసుకుంది. రాజస్తాన్-పంజాబ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఫీల్డింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన రాజస్తాన్ పంజాబ్ 26 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

మొదట బ్యాంటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది.

external02

కాగా ఈ మ్యాచ్ లో ఓ అద్భుత క్యాచ్  మ్యాచ్ ను మలుపు తిప్పింది. పంజాబ్ కెప్టెన్ బెయిలీ కొట్టిన షాట్ కు రాజస్తాన్ ఆటగాళ్లు సౌథీ, కరుణ్ కలిసి పట్టుకున్న తీరు అమోఘం. మిడ్ వికెట్ మీదుగా కొట్టిన బంతిని సౌతీ బౌండరీలైన్ వద్ద సౌతి పట్టుకున్నాడు. బౌండరీ లైన్ కు సౌథీ తాకబోతుండగా.. బంతిని గాల్లోకి విసిరారు. అప్పుడే పక్కన ఉన్న కరుణ్ దాన్ని డైవ్ చేస్తూ పట్టుకున్నాడు. రెప్పపాటులో ఇదంతా జరగడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *