
హైదరాబాద్, ప్రతినిధి: తాము ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లలో అద్భుతాలు చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. బడ్జెట్ పై చర్చలో జానారెడ్డి అద్భుతాలు ఎలా సాధ్యం అని అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మించి తీరతామని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని ఆయన అన్నారు. తాము చెప్పిన పనులు వందశాతం సత్యం అనీ.. చేసి చూపిస్తామని తెలిపారు.
మరోమారు జానా అప్పులపై ఎఫ్ఆర్బీఎం నిబంధనల గురించి మాట్లాడారు. ఎఫ్ఆర్బీఎం నిబంధన ప్రకారం బడ్జెట్ లో మూడు శాతం మాత్రమే అప్పుతీసుకునే అవకాశం ఉందని దాని ప్రకారం 11వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. కానీ ప్పుడు 17వేలకోట్లు అప్పు తీసుకోవడం ఎలా సాధ్యం అని జానారెడ్డి అడిగారు. దీనిపై సీఎం స్పందించారు. మనం ఎఫ్ఆర్బీఎంను మార్చలేమని.. అయితే స్టేట్ టాక్స్, నాన్ టాక్స్ పై 90%అప్పు తీసుకునే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం మూడు శాతం.. అంటే 11 వేల కోట్లు అప్పు తీసుకోవచ్చని.. అలాగే ఎస్ఎటీఎం ద్వారా మరో 35 వేల కోట్లు అప్పుగా తీసుకోవచ్చు అని వివరణ ఇచ్చారు.