
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో
6 కిలో మీటర్లు కాలి నడకన మంత్రి జోగు రామన్న
పులులు, వన్య జంతు గణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జోగు రామన్న
ఐదేళ్లకోసారి జరిగే వన్య జంతు గణన ప్రక్రియ ప్రారంభం
పులులు, వన్య జంతు గణనలో స్వయంగా పాల్గొన్న మంత్రి జోగు రామన్న
మంత్రి జోగు రామన్నకు ఎదురైన జింకల గుంపు
చిరుతపులి, ఎలుగుబంటు, నీలుగాయి, కొండ గొర్రె కాలు ముద్రల సేకరణలో మంత్రి జోగు రామన్న
హైదరాబాద్, జనవరి 22 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని కొలాంగూడ, రాంపూర్ అటవీ బీట్‌లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఫారెస్ట్‌లో అటవీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న తెల్లవారు జామున కాలి నడకన ఆరు (6) కిలో మీటర్లు విస్తృతంగా పర్యటించారు. సోమవారం రాష్ర్ట వ్యాప్తంగా ప్రారంభమైన పులులు, వన్య జంతువుల గణన కార్యక్రమాన్నిమంత్రి జోగు రామన్నపాల్గొన్నారు. ఐదేళ్లకోసారి జరిగే పులులు, వన్య జంతు గణన కార్యక్రమంలో మంత్రి జోగు రామన్న స్వయంగా పాల్గొని చిరుతపులి, ఎలుగుబంటు, నీలుగాయి, కొండ గొర్రెల కాలు ముద్రలను సేకరించారు. అందులో భాగంగా అందుగు చెట్టును పరిశీలించారు. అందుగు చెట్టు బెరడును కొన్ని రకాల వన్య జంతువులు గోళ్లతో గీకడం, కొరుక్కుని తినడం చేస్తుంటాయి. ఉదయం 6.00 గంటలకే దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకున్న మంత్రి జోగు రామన్నకు జింకల గుంపు ఎదురైంది. మంత్రి జోగు రామన్న ఏకంగా ఆరు కిలో మీటర్లు కాలి నడకన అటవీ ప్రాంతాన్ని కలియ తిరిగారు. మంత్రి జోగు రామన్న ఉత్సాహంగా ఏకంగా ఆరు కిలో మీటర్ల కాలి నడక అటవీ సిబ్బందికి స్ఫూర్తినింపింది. రాష్ర్ట వ్యాప్తంగా ఏక కాలంలో మూడు వేల ఫారెస్ట్ బీట్స్‌లో వన్య జంతు గణన ప్రారంభమైంది.