ఐదుగురు టీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

-చిత్తుగా ఓడిన టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంతం నెగ్గించుకున్న టీఆర్ఎస్
హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరకు టీఆర్ఎస్ పంతం నెగ్గింది.. టీఆర్ఎస్ తరఫున నిలబడ్డ ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఆకుల లలిత కూడా విజయం సాధించారు. ఇక తక్కువ బలంతో నిలుచున్న టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు.

శాసనసభలో 63మంది ఎమ్మెల్యేలున్న టీఆర్ఎస్ తన ఐదుగురు అభ్యర్థులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు, నేతి విద్యాసాగర్, యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు లను ఎంఐఎం, సీపీఐ, టీడీపీ , కాంగ్రెస్ నుంచి వలసవచ్చిన మొత్తం 85 మంది మద్దతుతో గెలిపించుకుంది. ఒక్కో అభ్యర్థికి 17ఓట్ల చొప్పున మొత్తం 85 మంది టీఆర్ఎస్ మద్దతు తెలపడంతో ఆ ఐదుగురు విజయం సాధించారు.

ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 17మంది మద్దతు తెలపడంతో ఆమె గెలుపొందారు.

ఇక చివరన టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేల ఆరు ఓట్లు చెల్లకపోవడంతో దారుణంగా ఓడిపోయారు. పది మంది టీడీపీ, ఐదుగురు బీజేపీ సభ్యుల్లో ఆరుగురి ఓట్లు చెల్లనవి నిర్ధారణ కాగా ఒకరు నోటా నొక్కారు. దీంతో వేంకు రావాల్సిన 15ఓట్లు కూడా రాక దారుణంగా ఓడిపోయారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *