
రుషి, ఆంధ్రా పోరి..ఇలా విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ..మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ రాజ్ మధిరాజు. వైవిధ్యమైన కధాంశంతో రాజ్ మధిరాజు తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఐతే 2.0. ఈ చిత్రాన్ని ఫిర్మ్ 9 పిక్చర్స్ అమ్ బ్రిల్లా బ్యానర్ పై డా.హేమంత్ వల్లపు రెడ్డి, డా. రవి ఎన్ రతి, కె.విజయరామరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం బాలీవుడ్ పాపులర్ సింగర్ రితురాజ్ మొహన్ టీ పాట పాడడం విశేషం. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజ్ మధిరాజ్ మాట్లాడుతూ… బాలీవుడ్ పాపులర్ సింగర్ రితురాజ్ మొహన్ టీ మా ఐతే 2.0లో ఓ పాట పాడడం విశేషం. రితు రాజ్ మొహన్ టీ పాడిన….. ఈ గాయమే మీ గమ్యం..ఈ వాంఛనే మీ సీరామ అనే పల్లవితో సాగే పాటను రికార్డ్ చేసాం. సినిమా సెకండాఫ్ లో ఒక కీలక ఘట్టంలో ఈ పాట వస్తుంది. రితురాజ్ మొహన్ టీ బ్యూటీఫుల్ వాయిస్ తో ఈ పాట మరింత అందంగా…అద్భుతంగా వచ్చింది. కిట్టు విస్సాప్రగడ ఈ పాటకి మంచి సాహిత్యాన్ని అందించారు. మనం చాలా పాటలు వింటాం కానీ…ఇలాంటి పాటలు మాత్రం చాలా అరుదుగా వింటుంటాం. ఖచ్చితంగా ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. రితురాజ్ మొహన్ టీ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ప్రేమ్ రతన్ ధన పయో కి కూడా పాట పాడడం విశేషం. ఇక సినిమా కథ విషయానికి వస్తే….ఇది ఐతేకి మాత్రం సీక్వెల్ కాదు..ఐతే సినిమాకి ఐతే 2.0కి ఎలాంటి సంబంధం లేదు.ఇది ఆరుగురు యువకులు చుట్టు తిరిగే కథతో రూపొందుతుంది. ప్రజెంట్ సోషల్ నెట్ వర్కింగ్ ఎలా ఉంది..? యూత్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీతో యూత్ కు మంచి సందేశం అందిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం అరుణ్ చిల్వేరు, ఎడిటింగ్ శశాంక్ మలి, కెమెరా కౌసిక్ అభిమన్యు, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయిర్ .