ఐడీహెచ్ కాలనీని సందర్శించిన కేసీఆర్

హైదరాబాద్ : నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన కోరిక అని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కట్టించాలనే ఆలోచన కూడా అందుకే చేశానని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లోని ఐడిహెచ్‌ కాలనీలో నిర్మిస్తున్న నూతన గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి గురువారం సందర్శించారు. మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్‌, శ్రీ టి.హరిష్‌రావు, శ్రీ నాయిని నర్సింహరెడ్డి, శ్రీ ఐ.ఇంద్రకరణ్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ శ్రీ సోమేష్‌కుమార్‌ తదితరులు ముఖ్యమంత్రితో ఉన్నారు.

kcr12

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కేసిఆర్‌ అత్యంత దుర్బర పరిస్థితుల్లో జీవిస్తున్న ఐడిహెచ్‌ కాలనీ వాసుల దుస్థితిని కళ్లారా చూశారు. వారందరికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా గత ఏడాది అక్టోబర్‌ 3న కొత్త ఇండ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిహెచ్‌ఎంసి అధికారులు ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 32 బ్లాకుల్లో జి ప్లస్‌ టూ పద్దతిలో 396 కడుతున్నారు. ఇందుకోసం రూ. 37 కోట్ల వ్యయం చేస్తున్నారు. ప్రతి ఇల్లు రెండు బెడ్‌ రూమ్‌లు, హాలు, కిచెన్‌, రెండు టాయిలెట్లతో కూడుకుంది. ఒక్కో ఇల్లు 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఒక్కో ఇంటికి రూ. 7.9 లక్షల వ్యయం చేస్తున్నారు. ప్రతి ఇంటిలో విద్యుత్‌ కనెక్షన్‌, నల్లా కనెక్షన్‌ కూడా పెడుతున్నారు. కాలనీలో మురికి నీటి కాలువలు, వర్షపు నీటి కాలువలు, మంచినీటి పైపులైన్లు కూడా నిర్మించారు. వాటన్నింటిని ముఖ్యమంత్రి కలియతిరిగి పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

kcr1234

ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్‌ 2న గృహ సముదాయాన్ని తానే స్వయంగా ప్రారంభిస్తానని సిఎం చెప్పారు. ఈ సందర్బంగా కాలనీకి చెందిన మహిళలు రూపవతి, మున్నాభాయ్‌, లలిత తదితరులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించి ఇండ్లు కట్టించడం సంతోషంగా ఉందన్నారు. సామానులు పెట్టుకోవడానికి సబ్జలు కూడా నిర్మించాలని మహిళలు ముఖ్యమంత్రికి విన్నవించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ప్రతి ఇంటిలోని వంట గదిలో, పడక గదిలో, హాలులో సబ్జలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంలోని నిరుపేదలందరికి ఇదే రకమైన ఇండ్లు కట్టించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సిఎం చెప్పారు. ఐడిహెచ్‌ కాలనీ, మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సిఎం చెప్పారు.

kcr125kcr12345

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *