
ఐడిసి పథకాలతో లక్ష ఎకరాలకు సాగునీరు.ఉదాసీన ఉద్యోగులపై చర్యలు.
మంత్రి హరీశ్ రావు సమీక్ష.
———————————-
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నఐడిసి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని మంత్రి ఆదేశించారు.ఆయా లిఫ్ట్ పనుల పురోగతిపై టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హరీష్ రావు అన్నారు.ఆన్ గోయింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథలాలన్నింటినీ వెంటనే అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 13లోని తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంటు కార్పొరేషన్ ఆఫీసులో ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి తో కలిసి మంత్రి హరీశ్ రావు శనివారం నాడు ఐ డీసీ పథకాల తీరుతెన్నులు, వాటి పురోగతి, కొత్తగా మంజూరు అయిన లిఫ్టులను సమీక్షించారు. జిల్లాల వారీగా ఐడిసి పథకాల ప్రోగ్రెస్ ను ఆయన సమీక్షించారు. ఇప్పటికే మంజూరయి ప్రారంభం కాని లిఫ్టుల పనులను త్వరలోనే ప్రారంభించి ఆయకట్టుకు సాగునీటిని అందించాలని చైర్మన్ గారిని కోరారు.ఐడిసి కింద చేపట్టిన పాత పథకాలు,పునరుద్ధరణకు నోచుకున్న పథకాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో 582 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఇందులో సుమారు 80 మాత్రమే వివిధ స్థాయిలలో పనిచేస్తున్నాయి.తెలంగాణ ప్రభుత్వంఏర్పడ్డతరువాత125పథకాలకుమరమ్మతులుచేపట్టారు.మిగతా 377 పథకాలు పూర్తిగా పనికిరాకుండా ఉన్నాయి వాటికి కొత్తగా నిధులు ఖర్చుపెట్టి అందుబాటులోకి వచ్చే పథకాలను గుర్తించి ప్రభుత్వం వాటికి మరమ్మతులు చేస్తుందని అన్నారు.వాటికి సుమారు 460 కోట్లు అవసరమని గుర్తించింది.మరికొన్ని కొత్త పథకాలను ప్రభుత్వం చేపట్టింది.నీటిలభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రాష్ట్రం ఏర్పడే వర కు కేవలం 46 వేల ఎకరాలకు మాత్రమే ఐడిసి పథకాలతో నిరందేది. వచ్చే రబీ సీజన్ వరకు లక్ష ఎకరాలకు సాగునీటిని అందించవలసిందేనని మంత్రి హరీశ్ రావు, ఈద శంకర్ రెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పడ్డ పథకాల ద్వారా ఇంకొక 35 వేల ఎకరాల కు నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ నెలలోనే మరో 28 పథకాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్టు ఈద తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైౖర్మన్ ఈద శంకరరెడ్డి,ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఐడిసి ఎం.డి. సురేశ్ కుమార్,ఇతర అధికారులు పాల్గొన్నారు.