Breaking News

ఐటీపై నిర్దిష్టమైన ఆలోచన ఉంది

ktr

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వానికి ఐటీపై నిర్దిష్టమైన ఆలోచన ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు విశేషాలను కేటీఆర్ మీడియాకు వివరించారు. ఈ సదస్సును హైదరాబాద్ లో నిర్వహిస్తున్నందుకు నాస్కామ్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సుకు ఐటీ దిగ్గజాలను ఆహ్వానిస్తామని, భారత, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈవెంట్ ను నిర్వహిస్తామన్నారు. పారిశ్రామిక పాలసీ కేబినెట్ సమావేశంలో అప్రూవల్ అయిన తరువాత వివరాలు మీడియాకు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

సీఎం ఎక్కడికైనా వెళుతారు..
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ అమెరికా పర్యటనపై ఓ విలేకరి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అమెరికా వెళుతారు..గల్ఫ్ కు వెళుతారు…ఎన్ని రకాలుగా ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ ఉజ్వలంగా ఉండేందుకు ఎన్ని చర్యలు చేయాలో అన్ని తీసుకుంటారని, అలాగే మీడియాకు తెలియని విధంగా వ్యవహరించమన్నారు. కేసీఆర్ పర్యటన షెడ్యూల్ మీడియాకు ఇచ్చే వెళుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *