ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం

కరీంనగర్ : ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ)  రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అన్నారు. మంథని కి చెందిన అల్లం నారాయణ సారథ్యంలోని టీయూడబ్ల్యూజే నాయకులు  బుధవారం ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజేలో కరీంనగర్ ప్రెస్ భవన్ లో చేరారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగునూరి శేఖర్ మాట్లాడుతూ అల్లం నారాయణ  ఏర్పాటు చేసిన టీయూడబ్ల్యూజేను మా సంఘంలో విలీనం చేయడానికి  ప్రయత్నాలు చేస్తున్నామని.. దీనిపై రెండు సార్లు చర్చలు జరిపామని తెలిపారు. అల్లం నారాయణ ఏర్పాటుచేసిన సంఘం కూడా తెలంగాణ  రాష్ట్ర సాధన కొరకే ఏర్పాటు చేశారని.. ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టుల కోసం కలిసి పనిచేయాల్సిన తరుణం వచ్చిందన్నారు. కలిసి పనిచేస్తేనా జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.  తమ సంఘాన్ని వ్యతిరేకించేవారు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా కూడా తమకు వ్యతిరేకమే అని అన్నారు. త్వరలోనే జర్నలిస్టుల కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. మంథనిలో ఎవరికి అన్యాయం జరుగకుండా రెండు ప్రెస్ సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్ మాట్లాడుతూ పాత వారంతా సొంతగూటికి రావాలని..మిగతా వారు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో   ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, నాయకులు, జర్నలిస్టులు అయిలు రమేశ్, ఎలగందుల రవీందర్, కోల తిరుపతి,రవీంద్రాచారి, బి. విజయసింహారావు, రామ్ కుమార్, కొమురాజు చంద్రమౌళి, కె. నాగులు, పి.శ్రావణ్ కుమార్, మహమూద్ ఖాన్, ఎన్. రాజమౌళి గౌడ్, అంకరి ప్రకాశ్, ఆర్ల బాపు, పోతరాజు సమ్మయ్య, రావికంటి  దిలీప్ కుమార్, చంద్రమోహన్, తగరం రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *