
బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు పొందిన రాజమౌళి మద్రాస్ ఐఐటీలో జరిగిన విద్యార్థులతో తన తప్పును ఒప్పుకున్నాడు.. మద్రాస్ ఐఐటీలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో ఓ స్టూడెంట్ రాజమౌళిని మీరూ ‘హాలీవుడ్ సినిమాలను చూసి ఇన్ స్పైర్ పొందుతారా’ అని ప్రశ్నించాడు.. కాగా దీనిపై రాజమౌళి సూటిగా స్పందించారు. రాజమౌళి నిజాయితీగా తాను హాలీవుడ్ సినిమాలు కాపీ కొడతానని ప్రకటించారు.దీంతో విద్యార్థులు చప్పట్లతో రాజమౌళి నిజాయితీకి ఫిదా అయ్యారు..
తాను కాపీ కొడతాను కానీ నేటి తరం వాళ్ల మూవీలు కాదని.. ఒకప్పుడు పెద్ద హిట్ అయిన చిత్రాలలోని సీన్లను కథలో ఇనుమడింపచేస్తానని తెలిపారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచే హాలీవుడ్ సినిమాల ప్రభావం తనపై ఉందన్నారు. వాళ్ల సీన్లు అలా తీస్తే దాన్ని మరింత క్రియేటవిటీని జోడించి అద్భుతంగా తీయడం తనకు అలవాటన్నారు.