ఐఏఎస్ ల ఓటు చంద్రబాబుకే..

ఉత్తరాఖండ్ : అది చత్తీస్ ఘడ్ లోని ఐఏఎస్ ల శిక్షణా కేంద్రం. శిక్షణపొందుతున్న ఐఏఎస్ లకు ఒక పరీక్ష పెట్టారు. ‘సివిల్ సర్వీసెస్ ఇన్ ఏ గ్లోబలైజ్ వర్ట్’ అనే అంశంపై ఏ సీఎం ప్రసంగిస్తే బాగుంటుందో తెలుపాలంటూ ఓటింగ్ పెట్టారు.ఈ ఓటింగ్ లో భారత్ లోని మొత్తం 29 రాష్ట్రాల సీఎంలను పెట్టారు. కాగా ఆ ఐఏఎస్ లందరూ చంద్రబాబుకే ఓటేశారు.

ప్రస్తుతం 2014 బ్యాచ్  ఐఏఎస్ కోచింగ్ అక్కడ జరుగుతోంది.వారితో పాటు 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఐఏఎస్ లు కూడా శిక్షణ పొందుతున్నారు. వీరిందరికి ప్రసంగించే అదృష్టం చంద్రబాబుకు వరించింది. దీంతో మంగళవారం చంద్రబాబు  ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వెళ్లి ఇక్కడి నుంచి హెలికాప్టర్ లో ముస్సోరి వెళ్తున్నారు. అక్కడ ప్రసంగం పూర్తయ్యాక ఢిల్లీలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *