Breaking News

ఐఎంఎ తెలంగాణ అధ్య‌క్షునిగా శ్యామ్‌సుంద‌ర్ ఎన్నిక‌

ima telangana elections

 

హైద‌రాబాద్ : ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఎ) తెలంగాణ శాఖ ఆవిర్భ‌వించింది. స్ధానికి కోఠీలోని ఐఎంఎ భ‌వ‌న్‌లో గురువారం రాత్రి వ‌ర‌కు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక అనంత‌రం తెలంగాణ శాఖ తొలి నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించారు. ఐఎంఎ జాతీయ అధ్య‌క్షుడు ఎ.మార్తాండ పిళ్లై, గౌరవ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్  డాక్ట‌ర్ కె.కె. అగ‌ర్వాల్‌, తెలంగాణ శాఖ చీఫ్ ఎన్నిక‌ల అధికారి డాక్ట‌ర్ సివీ పిళ్లై హాజ‌రై నూత‌న కార్య‌వ‌ర్గం ఏర్పాటు విష‌యాన్ని వెల్ల‌డించారు.  ఈ శాఖ నూత‌న అధ్య‌క్షునిగా డాక్ట‌ర్ కె.శ్యామ్ సుంద‌ర్ (క‌రీంన‌గ‌ర్‌), వ‌చ్చే ఏడాదికి డాక్ట‌ర్ టి.న‌ర‌సింగ‌రెడ్డి( వ‌రంగ‌ల్‌) , ఉపాధ్య‌క్షులుగా డాక్ట‌ర్  కె.గోపాల‌కృష్ణ‌(హైద‌రాబాద్‌), ఎం.శ్రీ‌హ‌రి(నిజామాబాద్‌) ,
వి.విజ‌య్‌కుమార్‌( కొత్త‌గూడెం), గౌర‌వ కార్య‌ద‌ర్శిగా ఎ.భ‌ర‌త్‌ప్ర‌కాష్‌(హైద‌రాబాద్‌), సంయుక్త కార్య‌ద‌ర్శిగా సి.సురేంద్ర‌నాధ్ (హైద‌రాబాద్‌), రీజ‌న‌ల్ జాయింట్ సెక్ర‌ట‌రీలుగా ఎం.బాల‌రాజ్‌(హైద‌రాబాద్‌), ఎం. వ‌సంత‌రావు (క‌రీంన‌గ‌ర్‌),కె. అశోక్ రెడ్డి(వ‌రంగల్‌), కోశాధికారిగా కె.బాల‌రాజ్‌(హైద‌రాబాద్‌)
వీరేగాక 15 మంది రాష్ట్ర వ‌ర్కింగ్ క‌మిటీ మెంబ‌ర్స్‌, ప‌ది మంది జ‌న‌ర‌ల్ వ‌ర్కింగ్ క‌మిటీ మెంబ‌ర్స్ ఎన్నిక‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు. కాగా తెలంగాణ శాఖ త‌ర‌పున ఆగ‌స్లు 15న 68వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఏక‌గ్రీవంగా తీర్మానించారు. అంతేగాక ఆగ‌స్టు 8,9 తేదీల్లో ముంబైలో జ‌రిగే ఐఎంఎ జాతీయ స‌మావేశాల‌కు అధ్య‌క్షుడు శ్యామ్ సుంద‌ర్‌, కార్య‌ద‌ర్శి భ‌ర‌త్ ప్ర‌కాష్ హాజ‌రుకావాల‌ని,  ఆగ‌స్లు 16న హైద‌రాబాద్‌లో జ‌రిగే ఐఎంఎ ఎఎమ్మెస్ జాతీయ స‌మావేశాల‌లో పాల్గొనాల‌ని తీర్మానించారు. నూత‌న శాఖ  కార్య‌వ‌ర్గం ఏర్పాటుకు స‌హ‌క‌రించిన అంద‌రికీ అధ్య‌క్షుడు శ్యామ్ సంద‌ర్ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో కృత‌జ్ఞ‌త‌లు  తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *