ఏసీబీ విచారణకు హాజరైన సండ్ర

maxresdefault

హైదరాబాద్ : ఏసీబీ తాజా నోటీసులు జారీ చేయడంతో సత్తుపల్లి ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో రేవంత్ అరెస్ట్ అవడం ఆ కేసులో ఏసీబీ విచారణ జరుగుతుండడం తెలిసిందే..

విచారణలో భాగంగా కేసుతో సంబంధమున్నట్టు ఆరోపణలు వస్తున్న సండ్ర వెంకటవీరయ్యకు, రేవంత్ సహాయకుడు జిమ్మీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

మరోవైపు ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని సండ్ర విలేకరులతో చెప్పారు. ఓటుకు నోటు కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *