Breaking News

ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కు సన్మానం

sudarshan goud

కరీంనగర్, ప్రతినిధి : ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం)నకు ఎంపికైన కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి. సుదర్శన్ ను జగిత్యాలకు చెందిన కళాశ్రీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కరీంనగర్ లోని ఏసీబీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ సన్మానంలో ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ సమర్థవంతమైన సేవల ద్వారానే గుర్తింపు లభిస్తుందన్నారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రజలు తమవంతు సహకారం అధించాలని కోరారు.

కార్యక్రమంలో కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ అధ్యక్షులు గుండేటి రాజు, సీనియర్ జర్నలిస్ట్ టి.వి. సూర్యం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండ శంకర్, బీ.జే.పీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి డి.సాజిద్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *