ఏసీబీ ఎందుకు సైలెంట్ అయ్యింది..!

000Ak-khan-and-Cm-KCr1

ఓటుకు నోటు కేసులో దోషుల వర్గం ప్రస్తుతం పండగ చేసుకుంటోంది. ఎందుకంటే కేసును విచారిస్తున్న తెలంగాణ ఏసీబీ సైలెంట్ అయ్యింది. గతంలో టీడీపీ నేతలు వేం నరేందర్ రెడ్డిని విచారించిన ఏసీబీ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నోటీసులు ఇస్తే ఆయన పోయి ఆంధ్రాలో సేదతీరుతున్నారు. ఇక ఎవరిని విచారించాలో తెలియక ఏసీబీ విచారణ పడకేసింది.

ఆధారాలు అన్ని సేకరించినట్టు కనిపించినా మరి చంద్రబాబుకు ఎప్పుడు నోటీసులు ఇస్తారనే విషయంపైన క్లారిటీ లేదు..కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించారు. వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత విచారణ ఆగిపోయింది. ఏసీబీలో ఏం జరుగుతుందో కేసు ను మూసేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుత పరిస్థితి చూస్తే కేసు కాంప్రమైజ్ అయినట్టు తోస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో తెలంగాణ ఐపీఎస్ లపై ఏపికి ఆధారాలు దొరకడం.. వారంతా దీర్గకాలిక సెలవుపై వెళ్లడం.. రేవంత్ కు బెయిలు రావడం చంద్రబాబు కేసులో ఇరుక్కునే పరిస్థితి కానరాకపోవడం తదితర పరిణామాలు కేసును తెలంగాణ ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *