
హైదరాబాద్ లోని నాగోల్ ప్రాంతం.. సకల సమస్యలతో సతమవుతున్న బస్తీ.. కనీసం కార్లు కూడా వెళ్లలేని ఇరుకైన రహదారులు.. అప్పుడే ఉన్నట్టుంది ఒక పెద్ద కాన్వాయ్.. వస్తుంది తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయి.. ఆదివారం నాగోల్ బస్తీల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ అక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేశారు. స్థానికంగా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటాలని చెప్పి… సీఎం కేసీఆర్ బస్తీలో ఒక మొక్క నాటారు.
కాగా సీఎం కేసీఆర్ ఇరుకు బస్తీల్లో కాన్వాయి గుండా వెళుతుండగా… ఎదురుగా ఒక గేదెల గుంపు వచ్చింది. అందులో సుమారు 20 గేదెల వరకు ఉన్నాయి. జనంతో కిక్కిరిసిన సీఎం కాన్వాయిని చెల్లచెదురుచేసింది. సీఎం కాన్వాయి దగ్గరకు దూసుకొస్తున్న ఈ గేదెలను పోలీసులు ఎంతో శ్రమకోర్చి లాఠీలు ఝులిపించి వాటిని వెనక్కి తరిమారు. లేకపోతే సీఎం కాన్వాయి కార్లను అవి గిరాటేసివి.
పాపం వాటికేం తెలుసు సీఎం సారూ మా కాలనీల్లోకి వచ్చారని.. జనం తరముడు చూసి అవి పోట్లగిత్తెల్లా కాన్వాయిలోకి దూసుకొచ్చాయి. పోలీసులు కొట్టకపోయుంటే అవి సీఎం కార్లను ఢీకొట్టేవి. మొత్తానికి సీఎం కేసీఆర్ కు ఆ బస్తీ గేదెలు కాసేపు కంగారు పుట్టించాయి.