ఏఫ్రిల్ 23న విడుదలకు సిద్దమవుతున్న ‘కాయ్ రాజా కాయ్’

పుల్ మూన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ’శివగణేష్ దర్శకత్వంలో రామ్ ఖన్నా, మానస్, షామిలి, శ్రావ్య హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘కాయ్ రాజా
కాయ్’.మారుతీ టాకీస్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఫ్రిల్ 23న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహలు చేస్తోంది. మారుతి వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్
గా వర్క్ చేసిన శివగణేష్ ‘కాయ్ రాజా కాయ్’చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూత్ పుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి జె.బి
సంగీతం అందిస్తున్నారు. ‘లవర్స్ ’వంటి భారీ సక్సెస్ అనంతరం ‘మారుతి టాకీస్’బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘కాయ్ రాజా కాయ్’చిత్రం పై అటు
ప్రేక్షకుల్లో, ఇటు చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివగణేష్ మాట్లాడుతూ.. రామ్ ఖన్నా, మానస్ హీరోలుగా నటిస్తున్న ఈ
చిత్రంలో జోష్ రవి ముఖ్య పాత్ర పోషించాడు. సాఫీగా సాగిపోయే ముగ్గురు కుర్రాళ్ళ జీవితంలో ‘కాయ్ రాజా కాయ్’ఆట ఎటువంటి పెనుమార్పులకు దారి తీసింది అనేది చిత్ర
కధాంశం. మాస్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరిగా ‘కాయ్ రాజా కాయ్’చిత్రాన్ని తెరకెక్కించాను. మారుతి గారు అందించిన ప్రోత్సాహంతోనే ఈ చిత్రానికి దర్శకుడిగా
మారగలిగాను. అలాగే ఫూల్ మూన్ ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఖర్చుకి వెనకాడకుండా మంచి సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగాను. ఏఫ్రిల్ 23న ప్రేక్షకుల
ముందుకు వస్తున్న ‘కాయ్ రాజా కాయ్’చిత్రాన్ని యూత్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’అన్నారు. మారుతీ మాట్లాడుతూ.. ‘శివగణేష్
కొత్తవాడైనా ‘కాయ్ రాజా కాయ్’చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. మారుతి టాకీస్ బ్యానర్ నుంచి
వస్తున్న ఈ చిత్రం మరో సూపర్ హిట్ గా నిలుస్తుందన్న పూర్తి నమ్మకం నాకుంది’అన్నారు!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *