ఏప్రిల్ 6న సిద్దిపేట మున్సిపాల్టీ ఎన్నికలు

చాలారోజులుగా వివాదాలతో పురపాలక ఎన్నికలు నిర్వహించకుండా నలిగిపోతున్న సిద్దిపేట ప్రజానీకం కష్టాలు ఎట్టకేలకు తీరిపోయాయి. సిద్దిపేట పరిసర గ్రామాల విలీనంతో మున్సిపాల్టీగా ఏర్పడ్డ సిద్దిపేటలో ఆయా గ్రామాల ప్రజలు కోర్టుకు వెళ్లారు. తమ గ్రామాలను పంచాయతీలుగానే గుర్తించాలని కోర్టులో కేసు నలుగుతోంది. సిద్దిపేటలో గ్రామ పంచాయతీల విలీనంపై వారు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు కేసులు, గ్రామాల విలీనంపై చర్యలు తీసుకుంది. దీంతో చాలా రోజుల తరువాత సిద్దిపేట మున్సిపాల్టీ ఎన్నికలకు మార్గం సుగమం అయ్యింది. సిద్దిపేట మున్సిపాల్టీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

   -సోమవారం నుంచి బుదవారం వరకు నామినేషన్లు స్వీకరణ

  • 25న ఉపసంహరణ
  • ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహిస్తారు..
  • 11న ఓట్ల లెక్కింపు, ఫలితాలను విడుదల చేస్తారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *