
కరీంనగర్ : ఐజేయూ అనుబంధ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టీయూడబ్ల్యూజే) తొలి మహాసభను ఏప్రిల్ 19న హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ తెలిపారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కరీంనగర్ జిల్లా శాఖ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వేల మంది జర్నలిస్టులు సంఘంలో సభ్యత్వం నమోదుచేసుకున్నారన్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 1300మంది జర్నలిస్టులు సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు.
హైదరాబాద్ లో నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలిరావాలని ఆయన కోరారు. ఈసభకు సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు హాజరుకానున్నారని తెలిపారు.
కార్యక్రమలో జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, ఐజేయూ సభ్యులు ఎన్ఎస్ రావు,ఎలగందుల రవీందర్, బల్మూరి విజయసింహారావు, సభ్యులు ముత్యం, పి. రవీందర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విజయసింహారావుకు సన్మానం
అనంతరం కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నమస్తే తెలంగాణ స్టాఫర్ బల్మూరి విజయసింహారవుకు ఘన సన్మానం చేశారు. టీయూడబ్ల్యూజేలో ఇటీవల చేరిన బల్మూరికి అధ్యక్షులు నగునూరి శేఖర్, జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్ అభినందనలు తెలిపారు.