ఏప్రిల్ 14 నుండి 21వరకు అగ్ని మాపక వారోత్సవాలు : నాయిని నరసింహారెడ్డి

 

             ఈ నెల 14 వతేదీ నుండి 21 వ తేదీవరకు అగ్ని మాపక వారోత్సవాలు జరుపనున్నట్లు రాష్ట్ర హోం , అగ్నిమాపక శాఖామాత్యులు శ్రీ నాయిని నరసింహారెడ్డి తెలిపారు.  అయన అగ్ని మాపక వారోత్సవాలు జరపబోతున్న సందర్భంగా గురువారం సచివాలయంలో బ్రోచర్లు, కరపత్రాలు విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుపుతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో ప్రజలకు ఫైర్ వల్ల ఏం నష్టం జరగబోయేది, సిలిండర్లు ఎలా వాడాలో, దానివల్ల జరిగే ఆస్తి, ప్రాణ  నష్టాలు ఎలా నివారించాలో చెప్తారని అన్నారు.  అవగాహన కార్యక్రమాలు చేపడుతారని అన్నారు.  అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాలలో ప్రజలు టోల్ ఫ్రీ నెంబరు 101 కు ఫోన్ చేస్తే సిబ్బంది వెంటనే వచ్చి నివారణ చర్యలు చేపడుతారని తెలిపారు.  ప్రజలు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయడానికి వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు.  మా సిబ్బంది వచ్చినపుడు ప్రజలు వారికీ సహకరించి వివరాలు ఇవ్వాలని అన్నారు.  రాష్ట్రంలో 16 నియోజక వర్గాలలో అగ్ని మాపక స్టేషన్ లు లేవని, ఈ బడ్జెట్ లో ఈ నియోజక వర్గాలలో అగ్ని మాపక సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఈ ప్రదేశాలలోనే కాకుండా ప్రత్తి ఎక్కువగా ఉన్న చోట, అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే చోట రెండు స్టేషన్ లకు అనుమతి ఇస్తామని అన్నారు.  బుల్లెట్ మోటార్ సైకిల్ ల ద్వారా సిబ్బంది అగ్నిమాపక సేవలు చేస్తున్నారని, వీరి సేవలు జిల్లాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు.  పత్రికల ద్వారా మీడియా ద్వారా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనీ ప్రజలను అగ్ని ప్రమాదాలనుంచి రక్షించడంలో తోడ్పడాలని కోరారు.

కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర హోం శాఖ సెక్రటరీ అనితా రాజేంద్రన్ మాట్లాడుతూ, ఇంతకు క్రితం అగ్నిమాపక శాఖ సిబ్బంది అంటే కేవలం అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కాపాడేది గానే ఉండేదని, ఇపుడు దీని పరిధి విస్తరించి విపత్తులకు కూడా హాజరై, ప్రజలను కాపాడడం జరుగుతుందని అన్నారు.  ఈ శాఖ పేరును కూడా అగ్నిమాపక మరియు విపత్తుల స్పందన శాఖగా మార్పు చేయడం జరిగిందని అన్నారు.  రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలలో ఫైర్ స్టేషన్ లు ఉండేలాగున చర్యలు తీసుకుoటున్నామని అన్నారు.

రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ రతన్ మాట్లాడుతూ, ప్రజలకు చిన్న చిన్న అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా, ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలియ చేయాలనీ అన్నారు.  ఫాం ఫ్లేట్స్, బ్రోచర్స్ ద్వారా ప్రచారం చేయాలని, ఈ వారం రోజులు సిబ్బంది చాలా ఎక్స్ టెన్సివ్ గా పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్ శ్రీ పాపయ్య, తదితర ఫైర్ సర్వీసుల అధికారులు పాల్గొన్నారు.   

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *