Breaking News

ఏప్రిల్ లో టెట్

TSTET-2015-16

చాలారోజులుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తేదీ మళ్లీ మారింది. గత నెలలో టెట్ నిర్వహణకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ వరంగల్ , ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొందరు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయడంతో నోటిఫికేషన్ ఆగిపోయింది. మళ్లీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాయగా ఇటీవల టెట్ నిర్వహణకు కమిషన్ అంగీకరించింది..

కాగా టెట్ నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో ఫిబ్రవరికి తేదిని మార్చారు. కానీ పరీక్షల వేళ టెట్ నిర్వహిస్తే పాఠశాలల్లో పనిచేసే విద్యావలంటీర్లు, ఉపాధ్యాయులు స్కూళ్లు బంద్ చేస్తారని.. దీని వల్ల వేల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని పాఠశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ కు టెట్ ను మార్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *