
విజయవాడ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు అడ్డంగా బుక్ అవడం.. తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తుండడంతో ఆయన సీఎం పదవి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తే తదుపరి సీఎం ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ రేసులో బాలయ్య , లోకేశ్ లు ముందున్నారు. ఎక్కువగా బాలయ్యకే చాన్స్ ఉంది..
ఈ నేపథ్యంలో నే నిన్న బాలకృష్ణ ఏపీ సచివాలయాన్ని సందర్శించడం.. మంత్రులతో సమీక్షించడం అనుమానాలకు తావిస్తోంది. లోకేష్ చిన్న వయసు కావడంతో ఆయనను సీఎంగా ఆమోదించే అవకాశాలు లేవు. దీంతో తెరపైకి బాలయ్య వస్తారని సమాచారం. కాగా సీఎం చంద్రబాబు కేసునుంచి బయటపడగానే మళ్లీ బాలయ్య నుంచి పగ్గాలు చంద్రబాబు తీసుకుంటారని తెలుస్తోంది..