
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు సడెన్ గా తన ఆస్తుల లెక్కా పత్రం ప్రకటించారు. తనకు మొత్తం 12.39 కోట్ల ఆస్తులు.. రూ.4.72 కోట్ల అప్పులు ఉన్నాయని నారా లోకేష్ తెలిపారు. తనకు 7.67 కోట్ల ఆస్తులు, తన తండ్రి చంద్రబాబు నాయుడికి 50 లక్షల ఆస్తులు, 8 లక్షల అప్పులున్నాయని తెలిపారు. తనకు ఇంతకుముందటితో పోలిస్తే ఆస్తులు తగ్గాయని.. రూ. 2 కోట్లతో ఫాంహౌస్ కూడా కట్టుకున్నానని ఆయన చెప్పారు. బ్రహ్మణి అప్పులు కూడా కోటి రూపాయలు తగ్గాయని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
లోకేష్ ఆస్తుల లెక్కా పత్రం ఇదీ..
చంద్రబాబుకు ఆస్తులు 50 లక్షలు , అప్పులు 8 లక్షలు
భువనేశ్వరీకి ఆస్తులు 43.20 కోట్లు, అప్పులు 10.12కోట్లు
లోకేష్ ఆస్తులు 12.39 కోట్లు , అప్పులు 4.72 కోట్లు
బ్రహ్మణి ఆస్తులు 5.14 కోట్లు, అప్పులు 36 లక్షలు..