ఏపీ రిటైర్ ఉద్యోగుల పింఛను సవరణ ప్రారంభం

pensions

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 25-5-1998 ముందు వరకు ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు మహా గణాంకం( అకౌంటెంట్ జనరల్ ) కార్యాలయం వేతన సవరణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించింది. సుప్రీం కోర్ట్ ఉత్తర్వుల(సి ఏ నం 367-5368/05) మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక శాఖ ఉత్తర్వులననుసరించి(నం 223/15/12/14) ఈ పింఛను సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఇప్పటివరకు 3500 మంది పింఛనుదారుల పింఛను సవరణ కార్యక్రమం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఇంకా సుమారుగా 5000 వరకు ప్రతిపాదన పత్రాలు పరిశీలనలో వున్నాయని, ఈ పింఛను సవరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకులు ఇప్పటికే వారి సంబందిత జిల్లా అధికారులకు సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. పింఛనుదారులకు వారి పింఛను ప్రతిని పోస్టల్ ద్వారా పంపిస్తామని లేదంటే మా శాఖ వెబ్ సైట్ , ఫోన్ నం 040-23736811, 040-23236819 తెలుసుకోవచ్చన్నారు. 9492233447 నంబర్ కు మెసేజ్ ద్వారా తమ తమ పింఛను వివరాలు పొందవచ్చని మహా గణాంకం( అకౌంటెంట్ జనరల్ ) కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలియచేసింది

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *