ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ అందజేత

ChandrababuNaidu-EPS

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ నివేదికను చంద్రబాబుకు సింగపూర్ బృందం అందజేసింది. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబుతో సింగపూర్ బృందం సచివాలయంలో సమావేశామైంది.  ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ లో పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. తాగునీరు, విద్యుత్, రవాణా, మౌలికసదుపాయాల అభివృద్ధి, ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య, నివాసేతర భవనాలు, పార్కులు, వినోద కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలతో మాస్టర్ ప్లాన్ రూపొందిచబడింది. సమావేశం అనంతరం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సింగపూర్ బృందానికి చంద్రబాబు విందు ఇవ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 3.30కు చంద్రబాబు – సింగపూర్ బృందం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *