
ఏపీ రాజధాని భూమిపూజ సవ్యంగా సాగిందా..? ఏమైనా వాస్తు దోషం ఉందా.. అపచారం జరిగిందా..? ఇప్పుడు దీనిపై సన్నిహిత వర్గాలు దృష్టిసారించాయి. ఆ భూమిపూజ అనంతరమే సీఎం చంద్రబాబు కష్టాలపాలయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో చిక్కుకున్నారు. దీంతో ఆయన సన్నిహితులు ఇఫ్పుడు పాప పరిహారంపై చర్చిస్తున్నారు.
వేదపండితులను భూమిపూజ స్థలం వద్దకు వచ్చి పరిశీలింపచేశారు. అనంతరం వాస్తు దోషంపై ఏదైనా పూజలు చేయాలని నిర్ణయించారట..