
ఎట్టకేలకు ఆంద్రపై కేంద్రం కరుణచూపింది. ఏపీ రాజధాని నిర్మాణానికి విభజన చట్టం ప్రకారం ఓ 1500 కోట్లను విదలించింది. రాజధానికి, లోటు బడ్జెట్ కు నిధులు లేక అష్టకష్టాలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నాళ్లు కేంద్రం తీరుతో మనస్తాపంతో ఉంది. ఎన్నోసార్లు సీఎం చంద్రబాబు మోడీని కలిసి విన్నవించారు. ఈ ఒత్తిడి పనిచేసిందో ఏమో కానీ కేంద్రం స్పందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంకోసమంటూ రూ.1500 కోట్లను విడుదల చేసింది. ఇందులో 1000 కోట్లను కొత్త రాజధానిలో అత్యవసర సదుపాయాల కల్పనకు వినియోగిస్తారు. మిగిలిన 500 కోట్లను రాజ్ భవన్, సచివాలయం, శాసన సభ, హైకోర్టు తదితర భవనాల నిర్మాణానికి ఉపయోగిస్తారు.