
ప్రత్యేక హోదా కోసం ఏపీలో కాంగ్రెస్ చేసిన ఆందోళనలో అపశృతి చోటుచేసుకుంది. తిరుపతి కాంగ్రెస్ ప్రత్యేక హోదా పోరుసభలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది అన్ని చానాళ్లలో లైవ్ లో రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..
దాదాపు శరీరం మొత్తం కాలిపోవడంతో కుర్రాన్నివెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. కాగా ఈ ఆత్మహత్యాయత్నం ఏపీలో రాజకీయవేడి నెలకొంది. అన్నీ పార్టీలు టీడీపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి.. కాంగ్రెస్ పోరు సభలో కాంగ్రెస్ నాయకులు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, మాజీ కేంద్రమంత్రులు చిరంజీవి, పల్లంరాజు, కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.