
ఏపీ ప్రత్యేక హోదా కోసం మంటలు అంటుకున్నాయి.. నిన్న తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం చేసిన కాంగ్రెస్ ధర్నాలో ఓ యువకుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోవడం ఏపీలో రాజకీయ వేడిని రగిలించింది. ఏపీలో దాదాపు చచ్చిపోయిన కాంగ్రెస్ కూడా ఊహించని రీతిలో మైలేజీ తెచ్చింది.. ఈ వ్యవహారం టీడీపీ, బీజేపీని చాలా ఇరుకునపెట్టినట్టైంది..
ప్రత్యేక హోదా ఆందోళనలు ఏపీలో మొదలయ్యాయి.. యువకుడి ఆత్మహత్యాయత్నం ఇప్పుడు ఏపీలో మరో ఉద్యమాన్ని తెచ్చిపెడుతోంది.. హీరో శివాజీ ప్రత్యేక హోదా సాధన సమితితో ఉద్యమిస్తున్నాడు. మరికొన్ని విద్యార్థి సంఘాలు సైతం పోరుబాటకు సై అంటున్నాయి.. కాంగ్రెస్ పునరుత్తేజం కోసం ప్రత్యేక హోదాను టార్గెట్ గా ముందుకెళ్తోంది.. దీంతో ఏపీలో తెలంగాణ ఉద్యమం వలే మరో ఉద్యమం తెరమీదకు రానుంది..
అంతిమంగా ఇది టీడీపీ, బీజేపీ లను దగా చేశాయనే మెసేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ, కాంగ్రెస్ లు ఈ ఎజెండాను ముందుకుపెడుతున్నాయి. దీంతో ఇబ్బందుల్లో పడ్డ చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. మోదీ అప్పాయింట్ మెంట్ కోరాడు. కలిసి ప్రత్యేక హోదా కోసం అడుగనున్నాడు.
ఒక్క వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఏపీలో మరో ఉద్యమానికి కాణమైంది.. నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రత్యేక హోదా చిచ్చు టీడీపీ, బీజేపీ కాళ్లకు కిందకు నీరు తెస్తోంది..