
ప్రధాని మోదీ ఉత్తరాది పక్షపాతి అని తేలిపోయింది.. ఏపీ సీఎం చంద్రబాబు, ఇక్కడి నాయకులు గొంతుచించుకుంటున్న ప్రత్యేక హోదాపై మాట కూడా మాట్లాడడం లేదు.. ఏపీలో జరిగిన ఎన్నికల సభల్లో హామీ ఇచ్చిన మోదీ .. గెలిచాక ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ దాటవేస్తున్నారు.. కానీ
బీజేపీలో మంగళవారం పర్యటించిన మోదీ అక్కడ ఎన్నికలు సభల్లో మాట్లాడారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇస్తానని .. భారీగా నిధులు ఇచ్చి బీహార్ ను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అంతే కాదు.. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇంత ప్రేమ ఎందుకంటే బీహార్ త్వరలో ఎన్నికలు జరుగనుండడమే.. ఎన్నికల్లో గెలుపుకోసం మోడీ ప్రజలకు తాయిలాలు ప్రకటించారు. గెలిచాక వాటిని అమలు చేస్తారా.? లేక ఏపీ ప్రజల ను చేసినట్టు మోసం చేస్తారో మోడీ వైఖరిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.